: అయామ్ వేద్ ప్రకాశ్...ముందు సీడీలు, ఆ తరువాత షూ విసిరాను: కేజ్రీవాల్ పై దాడి నిందితుడు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై దాడికి దిగిన వ్యక్తి 'ఆమ్ ఆద్మీ సేన'కు చెందిన కార్యకర్త అని ప్రకటించారు. సరి, బేసి సంఖ్యల విధానం ప్రకటించే సందర్భంగా కేజ్రీవాల్ పై షూ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నిందితుడు మాట్లాడుతూ, తన పేరు వేద్ ప్రకాశ్ అని, తాను ఆప్ కు చెందిన వాడినేనని అన్నారు. ఆప్ నేతలపై స్టింగ్ ఆపరేషన్ చేశానని, కావాలంటే 'ఈ వీడియోలు చూడండి' అని చెబుతూ ముందు సీడీలను కేజ్రీవాల్ మీదకు విసిరాడు. ఆ తరువాత ఆయనపై షూ విసిరాడు. దీంతో భద్రతా సిబ్బంది ఆయనను అక్కడి నుంచి తరలించే లోపు ఆప్ కార్యకర్తలు అతనిపై దాడికి దిగారు.