: షూటింగులో హీరోయిన్ కాళ్లు నొక్కిన హీరో!
నిజ జీవితంలో ఏమాత్రం ఈగో ప్రదర్శించని హీరోగా బాలీవుడ్ లో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీకి పేరుంది. అందుకు తాజా నిదర్శమే ఈ సంఘటన. టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'అజార్' సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. షూటింగ్ చేయాల్సిన ప్రదేశంలో కార్ పార్కింగ్ కు అవకాశం లేదు. దీంతో యూనిట్ చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కాళ్లు నొప్పులంటూ కూలబడింది. దీంతో ఏమాత్రం భేషజం లేకుండా ఆమె కాళ్లకు హీరో ఇమ్రాన్ హష్మీ మసాజ్ చేశాడు. దీనిపై ఈ సినిమా దర్శకుడు టోనీ డిసౌజా స్పందిస్తూ, ఇమ్రాన్ హష్మీ చాలా గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. నర్గీస్ కు మసాజ్ చేసిన తరువాత తమ కాళ్లకు కూడా మసాజ్ చేస్తావా? అంటూ ఆటపట్టించినప్పటికీ ఆయన దానిని సరదాగా తీసుకోవడం ఆయన సహృదయానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.