: న్యాయమూర్తుల నిర్బంధం కేసులో .... ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ పై ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2007లో న్యాయమూర్తులను నిర్బంధించిన కేసు విచారణకు న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంతో అతడిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. 1999 నుంచి 2008 వరకు పాకిస్థాన్ కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సందర్భంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నిర్బంధించారనే ఆరోపణలతో ముషారఫ్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్ ఈ కేసులో విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ముషారఫ్ పై అనేక క్రిమినల్ కేసులు నమోదు కావడంతో 2013లో ఆయన దేశం విడిచి వెళ్లకూడదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ఆ నిషేధం ఎత్తివేయడంతో ముషారఫ్ దేశం విడిచి వెళ్లారు.