: ఏసీని ఎక్కువగా వాడుతున్నారన్న కోపంతో భార్య, కొడుకుని చంపేసిన కసాయి
మానవ సంబంధాలు పూర్తిగా క్షీణించి పోతున్నాయి. మనిషి చిన్న చిన్న కారణాలకే హత్యలు చేసేవరకు వెళ్తున్నాడు. కేరళలోని ఆంగ్మలీలో ఇటువంటి దారుణమే చోటుచేసుకుంది. ఏసీని అవసరానికి మించి ఉపయోగిస్తున్నారంటూ ఒక వ్యక్తి తన భార్య, కొడుకునే హతమార్చాడు. రైల్వే ఉద్యోగిగా పనిచేసి రిటైరైన పాల్ (81) అనే వ్యక్తి.. కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, ఏసీని ఎక్కువగా ఉపయోగించొద్దని వాపోయేవాడు. ఈ నేపథ్యంలో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్న భార్య, కొడుకును చూసి తీవ్ర ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఇనుప రాడ్ తో దాడి చేసి చంపేశాడు. అనంతరం ఆత్మహత్య ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులతో తాను చేసిన దారుణాన్ని ఒప్పుకున్నాడు. పెన్షన్‌తో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టమవుతోందని, అందుకే ఏసీని ఎక్కువగా ఉపయోగించొద్దని సూచించానని చెప్పాడు.