: రాహుల్ గాంధీపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేసిన బీజేపీ నేత


రాహుల్ గాంధీపై అసోం బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. అసమర్థ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నాడని మండిపడ్డారు. సోనియా గాంధీని రాహుల్ గాంధీ కంట్రోల్ చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ పూర్తిగా హస్తగతం చేసుకున్నారని ఆరోపించిన ఆయన, బీహార్ గురించి రాహుల్ కు పూర్తిగా తెలియదని, అసోం గురించి అస్సలు తెలియదని అన్నారు. తాను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారేందుకు కారణం రాహుల్ గాంధీ అని ఆయన విమర్శించారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశలేదని, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి శర్భానంద సోనోవాల్ కు పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు. లౌకిక రాష్ట్రమైన అసోంలో బీజేపీ అద్భుతంగా పని చేస్తోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News