: గొంతుకు, కాళ్లకు 460 కోట్ల బీమా చేయించిన పాప్ స్టార్!
అమెరికన్ పాప్ స్టార్ మారియా కేరీ తన గొంతుకు 230 కోట్ల రూపాయల బీమా చేయించుకుని సంచలనం రేపింది. ప్రపంచ వ్యాప్తంగా మారియా కేరీ పాటలకు విశేషమైన అభిమానులు ఉన్నారు. ఆమె పాటల రికార్డింగ్స్ 200 మిలియన్లు అమ్ముడుపోయాయి. తనకు విశేషమైన ప్రేరు ప్రఖ్యాతులు, ఆస్తులు సమకూర్చిన గొంతుకు ఆమె ఇప్పుడు బీమా చేయించుకుంది. ఆమె స్వరతంత్రులకు చేయించిన బీమా విలువ 35 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 230 కోట్ల రూపాయలకు పైమాటే. అన్నట్టు, ఆమె గొంతుతో పాటు ఆమె కాళ్లకు కూడా విశేషమైన అభిమానులున్నారు. 2006లో ఆమె కాళ్లకు 'లెగ్స్ ఆఫ్ ఏ గాడెస్' అవార్డును కూడా ఇచ్చారు. దీంతో ఆమె తన కాళ్లకు 35 మిలియన్ డాలర్ల బీమా చేయించుకుంది. దీంతో మొత్తం 70 మిలియన్ డాలర్ల బీమా చేయించింది. అంటే ఆమె కాళ్లు, గొంతు కలిపి 460 కోట్ల రూపాయల బీమా కలిగి ఉన్నారు అన్నమాట!