: 'మ్యూచువల్ ఫండ్' ప్ర‌క‌ట‌న‌ల్లోనూ ఇక‌పై సెల‌బ్రిటీలు!


పలు సంస్థలు నిర్వహించే 'మ్యూచువల్ ఫండ్'లకు చెందిన ప్ర‌క‌ట‌న‌ల్లో ఇక‌పై సెల‌బ్రిటీలు క‌నిపించే అవ‌కాశం ఉంది. పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించే దిశగా సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఈ ప్ర‌య‌త్నాన్ని మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సెబీ గట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంద‌ని సంబంధిత అధికారి ఒక‌రు తెలిపారు. సెల‌బ్రిటీల ప్ర‌క‌ట‌నతో పెట్టుబ‌డుల విస్త‌ర‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని సెబీ భావిస్తోంది. ఈ అంశంపై సెబీ ఛైర్మ‌న్ ఆమోదం తెల‌పాల్సి ఉంది. ప్ర‌క‌ట‌న‌ల్లో ముఖ్యంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్, క్రికెటర్ సచిన్, టీమిండియా కెప్టెన్‌ ఎంఎస్ ధోనితో పాటు ప‌లు రంగాల సెల‌బ్రిటీలను రంగంలోకి దింపాల‌ని యోచిస్తోంది. మ్యూచువల్ ఫండ్ విస్తరణకు ఇది శుభ‌ప‌రిణామాన్నిస్తుందని విశ్లేష‌కులు అంటున్నారు.

  • Loading...

More Telugu News