: అమెరికా జోకర్ అనుకుంటోంది...సత్తా చూపిస్తాం: ఉత్తర కొరియా
అమెరికా అంటే అంతెత్తున లేచిపడే ఉత్తరకొరియా సంచలన ప్రకటన చేసింది. తాము తయారు చేసే ప్రతి ఆయుధానికి అమెరికాను ధ్వంసం చేయగల సత్తా ఉందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. అమెరికా లక్ష్యంగానే తాము ఆయుధాలు తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ కొరియా, అమెరికా దేశాలు తమను జోకర్ అనుకుంటున్నాయని, తమ శక్తి ఏంటో రుచి చూసేరోజు త్వరలోనే రానుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఖండాంతర లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగల సామర్థ్యం ఉందని నిరూపించిన ఉత్తర కొరియా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ తాజా హెచ్చరికలపై అమెరికా దక్షిణ కొరియా ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.