: జాతీయ జెండాలతో ఢిల్లీ విద్యార్థుల ‘ఛలో ఎన్‌ఐటీ’... శ్రీనగర్ నిట్‌లో భద్రత కట్టుదిట్టం
దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతోన్న విద్యార్థుల ఆందోళనలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. తాజాగా శ్రీనగర్ నిట్ లో చెలరేగిన కాశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య వివాదం తీవ్రతరం అవుతోంది. అక్కడ స్థానికేతర విద్యార్థుల పట్ల పలు ఆంక్షలు విధించడంతో వారికి మద్దతుగా 150 మంది విద్యార్థులు ఢిల్లీ నుంచి శ్రీనగర్ నిట్‌కు బయలుదేరారు. జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని 12 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుమారు 150 మంది ‘ఛలో ఎన్‌ఐటీ’ నినాదంతో శ్రీనగర్‌కు బయలుదేరారు. మరో వైపు శ్రీనగర్ ఎన్‌ఐటీలో భద్రత కట్టుదిట్టం చేశారు. నిట్‌లో స్థానికేతర విద్యార్థులు చేస్తోన్న ఆందోళనలో విద్యార్థినులు కూడా పాల్గొన్నారు.