: విజయం తర్వాత కరీబియన్లు చిందులేస్తే... మ్యాచ్ మధ్యలోనే డ్యాన్స్ చేసిన కోహ్లీ!
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో... టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా, వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడింది. టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. టైటిల్ ఫేవరెట్ పై సాధించిన విజయంతో విండీస్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఏకంగా వరల్డ్ కప్ ను చేజక్కించుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీస్ లో భారత ఓటమి... అందరినీ నిరాశలో ముంచేసింది. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా... టీమిండియా వైఎస్ కెప్టెన్, భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీని మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో మనకు కనిపించని ఓ దృశ్యం తాజాగా వెలుగు చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన ఓ రేంజి స్కోరునే సాధించినా, ఆ తర్వాత బౌలర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ టీమిండియా చేజారింది. శ్లాగ్ ఓవర్ల దాకా ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడింది. ఈ క్రమంలో బౌండరీ లైను వద్ద ఫీల్డింగ్ లో ఉన్న కోహ్లీ... విజయం తమదేనన్న భావనతో స్టెప్పులేశాడు. ప్రస్తుతం నేషనల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియో వైరల్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.