: ఉప ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే రెండు వేల మంది విద్యార్థుల సంగతి ఏంటీ?: శ్రీనగర్ 'నిట్' స్థానికేతరులు
టీ-20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పరాజయంతో శ్రీనగర్ నిట్ లో చెలరేగిన కాశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య వివాదం ఇంకా రగులుతూనే ఉంది. స్థానికేతర విద్యార్థుల పట్ల పలు ఆంక్షలు విధించారు. దీంతో భయం నీడలో తమకు చదువులు వద్దని స్థానికేతర విద్యార్థులు అంటున్నారు. జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిట్‌ను సందర్శించడానికి భద్రత లేదని అంటున్నారని, ఉప ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే రెండు వేల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నిన్న తమను వేరే కళాశాలలకు బదిలీ చేయాలని డిమాండ్ చేసిన స్థానికేతర విద్యార్థులు.. నేడు నిట్ క్యాంపస్‌ను శ్రీనగర్ నుంచి జమ్మూకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.