: మహారాష్ట్రకు రా... కుత్తుకపై కత్తి పెడతా!: అసదుద్దీన్ కు రాజ్ ఠాక్రే సవాల్
మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ ఠాక్రే సవాల్ విసిరారు. ‘‘కుత్తుకపై కత్తి పెట్టినా... భారత్ మాతాకీ జై అనబోన’’ని ఒవైసీ చేసిన వ్యాఖ్యలను మరోమారు గుర్తు చేసుకున్న రాజ్ ఠాక్రే... నిన్న రాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ మహారాష్ట్రకు వస్తే... ఆయన కుత్తుకపై తాను కత్తి పెడతానంటూ రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిన్న గుడి పడ్వా పర్వదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా రాజ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సోదరులిద్దరూ బీజేపీకి మద్దతుగానే వ్యవహరిస్తున్నారని కూడా ఠాక్రే ఆరోపించారు.