: 'బాబాసాహెబ్'కు మ‌రో అరుదైన గౌర‌వం.. యూఎన్ఓలో అంబేద్కర్ జయంతి వేడుకలు


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుక‌లను న్యూయార్క్ సిటీలోని ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) కార్యాలయంలోనూ నిర్వ‌హించ‌నున్నారు. భార‌త ప్ర‌భుత్వం ఈ ఏడాది నిర్వ‌హిస్తోన్న అంబేద్క‌ర్ జ‌యంతి వేడుల‌కు కొన‌సాగింపుగా యూఎన్ఓలోనూ ఈ వేడుకలను చేప‌డుతున్న‌ట్లు భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. 1891 ఏప్రిల్ 14న అంబేద్క‌ర్ జ‌న్మించారు. ఆయ‌న 125వ జ‌యంతి వేడుక‌కు ఒక‌రోజు ముందు యూఎన్ఓ కార్యాలయంలో అంబేద్క‌ర్ చిత్రపటానికి నివాళులుల‌ర్పించి, స‌మ‌స‌మాజ స్థాప‌న కోసం ఆయ‌న చేసిన అపార కృషిపై పలువురు ప్ర‌సంగం చేస్తారు. కాగా, బీఆర్ అంబేద్క‌ర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడేలో జ‌న్మించారు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన బాబాసాహెబ్‌ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశారు. అడుగడుగునా కష్టాలకు, అవమానాలకు గుర‌వుతూ మ‌హోన్న‌త వ్య‌క్తిగా ఎదిగిన ఆయ‌న అత్యున్న‌త కృషికిగానూ భార‌త ప్ర‌భుత్వం 1990లో దేశ అత్యున్నత పుర‌స్కారం 'భారతరత్న' ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News