: అనంతలో టెన్షన్, టెన్షన్!... జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కోసం రోడ్డెక్కిన దళిత సంఘాలు


టీడీపీ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డెక్కితే రచ్చ రచ్చే. ఘాటు వ్యాఖ్యలతో పాటు నర్మగర్భంగా మాట్లాడే స్వభావమున్న ఆయన నిన్న అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్నపై తిట్ల వర్షం కురిపించారట. దీంతో దళిత సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జేసీపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి జేసీని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. అసలే నోటి దురుసుతో విరుచుకుపడే జేసీపై కేసు నమోదు చేసే విషయంలో పోలీసులు నీళ్లు నమిలారు. నేటి ఉదయం దాకా కేసు నమోదు కాలేదు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ లో ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా పలువురు దళిత నేతలు జేసీ వైఖరిపై నిప్పులు చెరిగారు. జిల్లా కేంద్రమైన అనంతపురంలోకి తాడిపత్రి సంస్కృతిని తీసుకురావాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. జేసీపై దళిత సంఘాల ఆందోళనతో అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News