: మహానగరంలో నేరగాళ్లకు సీసీ కెమెరాల భయం పట్టుకుంది: హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్‌లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడాలంటే సీసీ కెమెరాలకు దొరికిపోతామనే భయం నేరగాళ్లకు పట్టుకుందని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. నిఘా నేత్రాలు విరివిగా ఉపయోగించడంతో హైదరాబాద్‌ని నేరాలు లేని సిటీగా మార్చగలమని ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎన్టీపీసీ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడారు. సీసీ కెమెరాలతో పాతబస్తీలో నేరాలు తగ్గుతాయని అన్నారు. హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి పలు సంస్థలు భారీగా విరాళాలు అందించడాన్ని ఆయన అభినందించారు. గతంతో పోల్చితే హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ 14 శాతం తగ్గినట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు.