: బాసిత్ ప్రకటనను ఖండించకపోతే... తీవ్ర పరిణామాలు తప్పవు: పాక్ కు దోవల్ వార్నింగ్


భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలపై భారత్ లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ మొన్న చేసిన సంచలన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య వేడిని పుట్టించాయి. ప్రస్తుతానికైతే ఇరు దేశాల మధ్య సమగ్ర ద్వైపాక్షిక చర్చలు రద్దైనట్టేనని బాసిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బాసిత్ వ్యాఖ్యలతో నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్... జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తదితర కీలక అధికారులతో భేటీ అయ్యారు. సదరు భేటీ తర్వాత నిన్న రాత్రి అజిత్ దోవల్ మరోమారు కార్యరంగంలోకి దిగిపోయారు. నేరుగా పాక్ జాతీయ భద్రతా సలహాదారు నాసిర్ ఖాన్ జంజువాకు దోవల్ ఫోన్ చేశారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చిన సదరు ఫోన్ కాల్ కు జంజువా కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ సందర్భంగా దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలపై బాసిత్ చేసిన వ్యాఖ్యలను పాక్ ఖండించాలని సూచించారు. లేనిపక్షంలో తాము సదరు వ్యాఖ్యలను తీవ్రంగానే పరిగణిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఆయన జంజువాకు వార్నింగ్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News