: రాకెట్ ఇంజిన్ ప్రయోగ సాహసం చేసిన ఉత్తర కొరియా.. అమెరికాపై అణు దాడి చేసే శక్తి ఉందని వెల్లడి
ఉత్తర కొరియా మరో దుస్సాహసం చేసింది. ప్రపంచ దేశాలను రెచ్చగొట్టే మరో ప్రయోగం చేసింది. బహుళ అణు రాకెట్లను ప్రయోగించగల వ్యవస్థను తయారు చేసుకున్న దక్షిణ కొరియా తాజాగా ఖండాంతర లాంగ్-రేంజ్ బాలిస్టిక్ రాకెట్ ఇంజిన్‌ను ప్రయోగించింది. దక్షిణకొరియా-అమెరికా తమ గడ్డపై చేస్తోన్న పెరేడ్‌లతో తీవ్ర ఆగ్రహం మీదున్న ఉత్తరకొరియా.. తాజాగా ప్రయోగించిన ఈ కొత్త ఇంజిన్‌కు అమెరికాపై అణు దాడి చేసే శక్తి ఉందని వెల్లడించింది.