: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది చిన్నారులతో సహా 12 మందికి గాయాలు
హైదరాబాద్ పాతబస్తీ తలాబ్‌కట్టాలోని బన్ రోటీ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇంట్లో కిరోసిన్ డబ్బాలు ఉండటంతో మంటలు మరింత చెలరేగాయి. భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలకు ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.