: భారీ బ్లాక్‌హోల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. 17 బిలియన్ సూర్యులు ఒదిగిపోయేంత పరిమాణం
కాలిఫోర్నియా బెర్కిలీ విశ్వవిద్యాలయం 2011లో కనుగొన్న బ్లాక్‌హోల్ (కృష్ణబిలం) కన్నా భారీ పరిమాణంలో ఉన్న మరో బ్లాక్‌హోల్‌ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2011లో కనుగొన్న బ్లాక్‌హోల్ సుమారు 10 బిలియన్ సూర్యుల పరిమాణంలో ఉండి అప్పట్లో గిన్నిస్ బుక్‌లో కూడా ఎక్కేసింది. అయితే ఇప్పుడు ‘ఎన్‌జీసీ 1600’ కోమా క్లస్టర్‌కు వ్యతిరేక దిశలో ఉన్న కొత్తగా కనుగొన్న బ్లాక్‌హోల్ 17 బిలియన్ సూర్యుల పరిమాణం కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.