: పఠాన్ కోట్ దాడిపై దర్యాప్తు ముమ్మరం... మసూద్, మరో ముగ్గురు పాకిస్థానీలపై అరెస్ట్ వారెంట్లు


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన దర్యాప్తు వేగం పుంజుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మొమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించినట్లు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాదాపుగా ఆధారాలు సేకరించింది. ఈ మేరకు తాను సేకరించిన ఆధారాలను పాక్ కు అందజేయడమే కాక, మసూద్ సహా ఈ దాడి పథక రచనలో పాలుపంచుకున్న అతడి సోదరుడు రవూఫ్, మరో ఇద్దరు పాకిస్థానీలు కషిఫ్ జాన్, షాహిద్ లతీఫ్ లను అరెస్ట్ చేయాలని కోరింది. అయితే భారత వాదనను కొట్టేసిన పాక్... ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో నిన్న ఎన్ఐఏ అధికారుల అభ్యర్థన మేరకు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మసూద్ తో పాటు మిగిలిన ముగ్గురిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News