: ఐపీఎల్-9 మెగా టోర్నీ నేటి నుంచే!... ధోనీ, రోహిత్ ల మధ్య తొలిపోరు!


భారత్ లోనే కాక విశ్వవ్యాప్తంగా పెను ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ (ఐపీఎల్-9) నేటి నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ప్రారంభ వేడుకలు అదిరిపోయాయి. బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులతో హోరెత్తించారు. వీరితో కలిసి వెస్టిండీస్ జట్టు సభ్యుడు డ్వేనీ బ్రేవో కాలు కదిపి దుమ్మురేపాడు. ఇక ఈ సీజన్ లో అసలు పోరు నేటి నుంచి మొదలు కానుంది. వాంఖడే స్టేడియం వేదికగానే జరగనున్న ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, కొత్త జట్టు పుణే సూపర్ జెయింట్స్ తలపడనుంది. ముంబైకి టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ నేతృత్వం వహిస్తుండగా, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో పుణే బరిలోకి దిగుతోంది. నేటి రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News