: ఐపీఎల్-9లో ‘రాయల్ ఛాలెంజర్స్’కు రెండు జెర్సీలు


విజయ్ మాల్యాకు చెందిన కంపెనీల ఆధ్వర్యంలోని ఐపీఎల్ టీమ్ 'బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్' తాజా సిరీస్ లో (ఐపీఎల్-9) సరికొత్త రీతిలో ఎంట్రీ ఇవ్వనుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఈ సీజన్ లో రెండు జెర్సీలతో ఆడనుంది. సొంత మైదానం (బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం)లో జరిగే ఆటకు ఓ జెర్సీ, బయటి మైదానాల్లో జరిగే మ్యాచ్ లకు మరో జెర్సీని వాడనుంది. ఈ మేరకు నిన్న బెంగళూరులో సదరు డ్రెస్ లను కంపెనీ యాజమాన్యం విడుదల చేసింది. టాప్ లో నలుపు రంగు ఉన్న జెర్సీని సొంత మైదానంలో వాడే ఛాలెంజర్స్ ఆటగాళ్లు, టాప్ లో ఎరుపు రంగుతో ఉండే జెర్సీని బయటి మైదానాల్లో వాడనున్నారు. ఇలా ఒకే సిరీస్ లో రెండు రకాల జెర్సీలతో ఆడుతున్న జట్టుగా బెంగళూరు జట్టు రికార్డులకెక్కనుంది.

  • Loading...

More Telugu News