: ఫేస్‌బుక్ వేదికగా ఆయుధాలు అమ్ముతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ ఆయుధాల విక్రయానికి సోషల్ మీడియాను ఉపయోగించేస్తున్నారని స్మాల్ ఆర్మ్ సర్వే ప్రాజెక్టు తెలిపింది. ఫేస్‌బుక్ ద్వారా లిబియాలోని ఇస్లామిక్ స్టేట్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఉగ్రవాదులు ఆయుధ వ్యాపారం చేస్తున్నారని తెలిపింది. ఫేస్‌బుక్‌లోని పలు ఫీచర్లు వీరి ఆయుధ వ్యాపారానికి అనుకూలంగా ఉండడమే దీనికి కారణం. వీటి కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ గ్రూపుల్లో 400 నుంచి 14,000 మంది వరకు యూజర్లు ఉన్నట్లు తెలిపింది. భారీ విధ్వంసాలను సృష్టించే పలు రకాల ఆయుధాలను ఉగ్రవాదులు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచారని సర్వే తెలిపింది. ఆయుధాన్ని బట్టి వాటిలో కొన్నింటికి ధరలు కూడా నిర్ణయించారు. మరికొన్నింటిని ధరల వివరాలు తెలపకుండానే అమ్మకానికి పెట్టేశారని వెల్లడించింది. డిమాండ్‌ను బట్టి కొన్ని ఆయుధాలకు వేలం కూడా నిర్వహిస్తున్నారని తెలిపింది.