: 'చిన్నారి పెళ్లి కూతురు' మృతి కేసులో మరో కోణం.. బ్యాంక్ అకౌంట్ నుంచి 24 లక్షల రూపాయలు విత్ డ్రా


'చిన్నారి పెళ్లికూతురు'గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రత్యూష బెనర్జీ మరణం మిస్టరీలో మ‌రో విష‌యం వెలుగులోకొచ్చింది. ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి ఐదునెలల్లో 24 లక్షల రూపాయలు విత్ డ్రా అయిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తెలిసింది. గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వ‌ర‌కు ఈ డ‌బ్బు తీశారని గుర్తించారు. ఈ డబ్బు ఎవరు విత్ డ్రా చేశార‌న్న‌ది ఇంకా తెలియ‌లేదు. ఈ విష‌యాన్ని గురించి ప్ర‌త్యూష కుటుంబ సభ్యులు త‌మ‌కేం తెలియ‌ద‌ని చెప్పారు. ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగే ఈ డ‌బ్బు విత్ డ్రా చేసి ఉంటాడా..? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

  • Loading...

More Telugu News