: మీరు మ్యాచ్ లు ఆడుకోండి... మేం నీళ్లు మాత్రం ఇవ్వలేం... ఫడ్నవీస్ వ్యాఖ్యలతో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ లపై సందిగ్ధత
గడచిన 100 సంవత్సరాల్లో ఎన్నడూ ఎరుగని కరవు నెలకొన్న మహారాష్ట్రలో క్రికెట్ పోటీల కోసం నీటిని ఇచ్చే పరిస్థితి లేదని స్వయంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటించిన నేపథ్యంలో ముంబై, పుణె, నాగపూర్ నగరాల్లో మ్యాచ్ ల నిర్వహణపై సందిగ్ధత పెరిగింది. హైకోర్టులో సైతం ఇదే వాదన వినిపించామని, నీళ్లు ఇవ్వని కారణం చూపుతూ మ్యాచ్ లు మరో రాష్ట్రానికి వెళ్లిపోయినా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. మీరు ఆడుకోండి, ఆడుకోకపోండి. మేము నీరివ్వం, నీరు కావాలని అడగొద్దని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, నేడు ఆరంభ వేడుకలు, ఆపై మొదటి మ్యాచ్ వరకూ జరిపేందుకు ముంబై హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో మొత్తం 19 మ్యాచ్ లు జరగనుండగా, చాలా వరకూ టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి.