: పార్టీ ఎందుకు మారుతున్నానంటే...: వరుపుల వివరణ


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఎందుకు మారాల్సి వచ్చిందన్న విషయమై ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వివరణ ఇచ్చారు. గతంలో తాను సొంతంగా నిర్ణయం తీసుకుని పార్టీలు మారానని, ఇప్పుడు మాత్రం తన వెన్నంటి నడుస్తున్న కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవించేందుకు మాత్రమే పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పిన ఆయన, వచ్చే మూడేళ్లలో తన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిన తరువాతనే ఓట్లడుగుతానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కష్టపడుతున్నారని, ఆయనకు తన వంతు సహకారాన్ని అందిస్తానని వివరించారు.

  • Loading...

More Telugu News