: ముత్తయ్య బౌలింగుకి చిన్న పిల్లాడిలా తికమక పడేవాడ్ని.. విద్యార్థులకు ఆసక్తికర కబుర్లు చెప్పిన గిల్క్రిస్ట్
ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఢిల్లీలో పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపాడు. పిల్లలకు తన క్రికెట్ జీవితం గురించి ఆసక్తికర కబుర్లు చెప్పాడు. బ్యాట్స్‌మెన్‌గా తాను శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్, భారత బౌలర్ హర్భజన్ సింగ్ల బౌలింగ్ అంటే భయపడేవాడినని చెప్పాడు. క్రికెటర్ మైకేల్ హస్సీ సైతం మురళీధరన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడేవాడని విద్యార్థులతో అన్నాడు. పిల్లలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... ముత్తయ్య మురళీధరన్ విసిరే బంతులు తాను అంచనా వేసేలా ఉండేవి కావని చెప్పాడు. ఆ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో చిన్న పిల్లాడిలా తికమకపడేవాడినని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్.. తాను బ్యాట్స్‌మెన్‌గా క్రీజులో ఉన్నప్పుడు మురళీధరన్ వేసిన బంతుల్ని ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుతెచ్చుకున్నాడు. మురళీధరన్ బౌలింగ్‌లో ఓ మ్యాచ్‌లో తొలిబంతికే ఫోర్ కొట్టి, ఆ తర్వాత బంతికి ఔటైన సంగతిని విద్యార్థులకు చెప్పాడు.