: బెంగళూరులో 'సర్దార్ గబ్బర్ సింగ్' థియేటరులో కత్తులతో దాడులు, యువకుడి మృతి
నేడు విడుదలైన పవన్ కల్యాణ్ చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' ప్రదర్శితమవుతున్న ఓ థియేటరులో అభిమానుల మధ్య జరిగిన చిన్న గొడవ, కత్తులతో దాడులు చేసుకునేంత వరకూ వెళ్లగా, ఘటనలో డిగ్రీ చదువుతున్న రాకేశ్ నాయక్ అనే యువకుడు మరణించాడు. ఈ ఘటన బెంగళూరు, పావగడలోని అలంకార్ సినిమా హాల్ లో జరిగింది. సినిమా ప్రదర్శిస్తుండగా, ఉన్నట్టుండి ఇద్దరు యువకులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.