: ఐదు రాష్ట్రాలకు బీజేపీకి కొత్త అధ్యక్షుల నియామకం... తెలంగాణకు డాక్టర్ కె.లక్ష్మణ్!


ఐదు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులను నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి డాక్టర్ కె.లక్ష్మణ్ ను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం పార్టీ జాతీయ కమిటీ ప్రకటించింది. కర్ణాటక అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను, అరుణాచల్ ప్రదేశ్ లో తపిరా గావ్ ను అధ్యక్షులుగా నియమించింది. వీరితో పాటు పంజాబ్ లో పార్టీ అధ్యక్షుడిగా విజయ్ సాంప్లాను, యూపీలో కేశవ్ ప్రసాద్ ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మధ్యాహ్నం సమావేశమైన బీజేపీ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

  • Loading...

More Telugu News