: 6.6 కోట్ల బహుమతి పొందిన ఉత్తమ టీచర్... రూ. 1000 విలువైన జాకెట్ దొంగిలించి బుక్కైపోయింది!


నాన్సా ఆట్వెల్... కొంతకాలం క్రితం అమెరికాలో గ్లోబల్ టీచర్ ప్రైజ్ పొందిన మహిళ. 127 దేశాల నుంచి 1300 మంది పోటీపడగా, విజయం సాధించి బిల్ క్లింటన్ చేతుల మీదుగా సుమారు రూ. 6.6 కోట్ల ప్రైజ్ మనీ పొందిన ఆదర్శ ఉపాధ్యాయురాలు. అయితేనేం, ఇప్పుడు ఓ స్టోర్ లో రూ. 1000 విలువైన జాకెట్ దొంగతనం చేస్తూ, సెక్యూరిటీకి అడ్డంగా దొరికిపోయింది. గత నెల 28న డమారిస్కోటా ప్రాంతంలోని ఓ స్టోరుకు వెళ్లిన ఆమె, అక్కడ ఓ హ్యాంగరుకు తగిలించివున్న జాకెట్ ను ఫోల్డ్ చేసి, తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటుంటే, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆమె మీద కేసు పెట్టారు. అయితే, తాను గతంలో కొన్న జాకెట్ ను ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు వచ్చానని, సెక్యూరిటీ పొరపాటు పడ్డారని చెబుతున్న ఆమె, తన వాదనను నిరూపించుకోకుంటే గట్టి శిక్షనే ఎదుర్కోవాల్సి రావచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News