: అన్ని రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి... జీవితం అన్ని సమస్యల సమ్మేళనం: చంద్రబాబు ఉగాది సందేశం
దుర్ముఖి నామ సంవత్సరాదిని పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది సందేశాన్ని వినిపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో భాగంగా ఆయన పలువురికి కళారత్న, ఉగాది పురస్కారాలు అందజేసిన అనంతరం మాట్లాడారు. ఉగాది పచ్చడి అన్ని రుచుల సమ్మేళమని చెప్పిన చంద్రబాబు... జీవితాన్ని అన్ని సమస్యల సమ్మేళనంగా అభివర్ణించారు. దుర్ముఖి నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. నవ్యాంద్ర నూతన రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం ఓ చరిత్ర అని ఆయన అన్నారు. రాజధానికి అమరావతి పేరు పెడుతూ తాము తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని కూడా చంద్రబాబు చెప్పారు.