: బీఫ్ బ్యాన్ తో బతికిపోయిన పశువులు ఇప్పుడు ఆకలితో మరణిస్తున్నాయి!


మహారాష్ట్రలో పశువుల పరిస్థితి ఘోరమైపోయింది. రాష్ట్రంలో బీఫ్ బ్యాన్ తో బతికిపోయిన మూగ జీవాలు, ఇప్పుడు తినడానికి పశుగ్రాసం కరవై ఆకలితో మరణిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా రెండవ సంవత్సరమూ అల్లాడిస్తున్న కరవు పరిస్థితే ఇందుకు కారణం. గడచిన ఆరు నెలల వ్యవధిలో లక్ష్మణ్ రితాపోర్ అనే రైతుకు చెందిన నాలుగు ఆవులు, నాలుగు ఎద్దులు, రెండు బర్రెలు తిండి, నీరూ లేక మరణించాయి. వాటికి తాను ఆహారం పెట్టలేకపోయానని లక్ష్మణ్ వాపోవాల్సిన స్థితి. ఇది ఒక్క లక్ష్మణ్ విషయంలోనే కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఒట్టిపోయిన పశువులను అమ్ముకుంటే కొంత డబ్బైనా వచ్చేదని, కొత్త చట్టంతో తమకు ఆ అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఇంకా తనవద్ద 26 పశువులు ఉన్నాయని, వాటన్నింటికీ తిండి పెట్టాలంటే వారానికి రూ. 2 వేలు ఖర్చవుతుందని, పాల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు పశువుల పోషణకే పూర్తిగా సరిపోవడం లేదని లక్ష్మణ్ తెలిపాడు. కాగా, రైతులు పోషించలేక పోతున్న పశువులను కాపాడేందుకు ప్రభుత్వం పశువుల కొట్టాలను ఏర్పాటు చేయగా, ఒక్క మరాట్వాడా రీజియన్ లోనే 3.2 లక్షల పశువులు ఈ కొట్టాలకు చేరినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News