: ‘సర్దార్’లో పొలిటికల్ డైలాగులు పేల్చిన పవర్ స్టార్... సందర్భం సరైనదేనంటున్న ఫ్యాన్స్


టాలీవుడ్ అగ్ర నటుడు, జన సేన అధినేత పవన్ కల్యాణ్... తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు పవర్ స్టార్ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. సినిమా ఎలా ఉందన్న విషయం అలా పక్కనబెడితే... ఈ చిత్రాన్ని వేదికగా చేసుకుని పవన్ కల్యాణ్ పొలిటికల్ గా హీటెక్కించే డైలాగులు సంధించారు. ‘‘కాపు కాసినప్పుడు గుర్తుకు రాని నా కులం... అవసరం తీరిపోయాక గుర్తొచ్చిందా?’’ అని ఆయన చేసిన ఓ డైలాగ్ ఏపీ రాజకీయాలను హీటెక్కించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. అయితే సదరు డైలాగును పవన్ కల్యాణ్ అభిమానులు సమర్ధించుకుంటున్నారు. సందర్భానికి తగిన విధంగానే సదరు డైలాగు ఉందని వారు చెబుతున్నా... రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఈ డైలాగు వినిపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News