: పాత జ్ఞాపకాలు తలచుకుని భావోద్వేగానికి లోనైన రేణూదేశాయ్


"2004లో ఇదే రోజున నా చేతుల్లోకి ఓ బుజ్జి బాబుగా మొదటిసారి ఎత్తుకున్నా. అప్పుడే 12 ఏళ్లు అయిపోయాయా? నా అంత ఎదిగిపోయావు" అంటూ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ పాత జ్ఞాపకాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. నేడు ఉగాదితో పాటు తన కుమారుడు అకీరా పుట్టిన రోజును, సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలనూ మూడు పండగలుగా జరుపుకుంటున్నామని నిన్న వెల్లడించిన ఆమె, నేడు కొడుకు ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ, పాత విషయాలు గుర్తు తెచ్చుకున్నారు. అకీరా పుట్టడం తన అదృష్టమని, తల్లిగా గర్విస్తున్నానని ఐలవ్యూ అని చెబుతూ ఓ ఫోటోను ట్విట్టర్ లో పెట్టారు. నేడు అకీరాతో పాటే పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్, అఖిల్ లకు కూడా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News