: ఆ విషాదం దేవుడి హెచ్చరికే: నరేంద్ర మోదీ
మమతా బెనర్జీ అక్రమ పాలన నుంచి పశ్చిమ బెంగాల్ ను రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, ఇటీవలి ప్లైఓవర్ ప్రమాదాన్ని ప్రస్తావించారు. "తృణమూల్ కాంగ్రెస్ నుంచి బెంగాల్ ను కాపాడాలని చెప్పేందుకు దేవుడు ప్రజలకు పంపిన హెచ్చరికే ఈ ప్రమాదం. ప్రజల మరణాలపై సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు" అని నిప్పులు చెరిగారు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే, అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకెళుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మరిన్ని నిధులను కేటాయిస్తామని వెల్లడించిన ఆయన, ప్రజలు బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.