: తరగతులకు రాకుంటే అత్యాచారమే... శ్రీనగర్ ఎన్ఐటీలో పక్క రాష్ట్రాల యువతులకు బెదిరింపులు!


శ్రీనగర్ లోని ఎన్ఐటీలో పరిస్థితులు రోజురోజుకూ మరింత దారుణంగా మారుతున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, దాదాపు 2 వేల మందికి పైగా స్థానికేతర విద్యార్థినీ విద్యార్థులు తరగతులకు వెళ్లకుండా నిరసనలు తెలియజేస్తున్న వేళ, వారికి తీవ్ర బెదిరింపులు ఎదురవుతున్నాయి. యూనివర్శిటీని మరో ప్రాంతానికి మార్చాలని వీరు ఆందోళనలు చేస్తున్న వేళ, వెంటనే తరగతులకు రాకుంటే, స్థానికులతో అత్యాచారం చేయిస్తామని సహ విద్యార్థినిలు బెదిరిస్తున్నారని ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న ఇతర రాష్ట్రాల అమ్మాయిలు వాపోయారు. తమలో అభద్రతా భావం పెరిగిపోయిందని చెప్పిన బీహార్ విద్యార్థిని, తమకు న్యాయం జరిగేంత వరకూ నిరసనలు ఆపబోమని హెచ్చరించింది. కేవలం 10 శాతం స్థానిక విద్యార్థులు మాత్రమే తరగతులకు వెళుతున్నారని, మిగతా 90 శాతం తరగతులకు వెళ్లడం లేదని తెలిపారు. ఇదిలావుండగా, స్థానికేతరులు పోలీసులపై రాళ్ల దాడి చేస్తున్న దృశ్యాలు బయటకు విడుదలయ్యాయి. వర్శిటీలో పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, వీటికి హాజరు కానివారు తదుపరి పరీక్షలు రాయవచ్చని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News