: ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’... రాత్రి నుంచే అభిమానుల సందడి షురూ!


టాలీవుడ్ అగ్ర నటుడు, జన సేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం నేటి ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిన్న రాత్రి 12 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలతో సందడి చేసింది. ప్రత్యేకించి ఏపీలోని విజయవాడ, నెల్లూరు, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం బెనిఫిట్ షోలు ప్రారంభమయ్యాయి. దీంతో తమ అభిమాన నటుడి చిత్రాన్ని చూసేందుకు పవర్ స్టార్ అభిమానులు ఎగబడ్డారు. దీంతో విజయవాడలోని పలు సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇదిలా ఉంటే... బెనిఫిట్ షోలోనే మంచి టాక్ రావడంతో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైన ధియేటర్ల ముందు అభిమానుల క్యూలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News