: ఏపీలో మండుతున్న ఎండలు...అచ్చెన్నాయుడుకి వడదెబ్బ


ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండల ధాటి మంత్రి అచ్చెన్నాయుడుకి కూడా తగిలింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో జరుగుతున్న గిరిజనోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఐటీడీఏ సమీపంలోని కలెక్టర్ భవనం వద్ద సేదదీరి, ఉత్సవాల్లో పాల్గొనకుండానే స్వగ్రామం నిమ్మాడ బయల్దేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News