: మ్యాచ్ లను తరలించినంత మాత్రాన కరవు పరిష్కారమవదు: వీవీఎస్ లక్ష్మణ్
మహారాష్ట్రలో ఏర్పడిన కరవు నేపథ్యంలో, లక్షల లీటర్ల నీటిని వేస్టు చేస్తూ ఆ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించవద్దంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో సన్ రైజర్స్ హైదరాబాదు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరవుకు పరిష్కారం మ్యాచ్ ల తరలింపు కాదని అన్నారు. మ్యాచ్ లు తరలించినంత మాత్రాన కరవు పరిష్కారమైపోదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కరవుతో అల్లాడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కరవు నివారణకు సరైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కరవుకు ప్రధాన కారణాలు కనుగొని దానిని పరిష్కరించాలని ఆయన చెప్పారు.