: బాహుబలి నేను చూళ్లేదు...అమీర్ లా పారిపోకూడదు...రోహిత్ వేముల ఇష్యూ అవసరమా?: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు


సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా సమస్యలుండగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల విషయాన్ని రాజకీయపార్టీలు హైలైట్ చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన అసహనం వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ...అమీర్ ఖాన్ తన ఇంట్లోని సంభాషణను జనరలైజ్ చేసి చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఒకసారి వ్యాఖ్యలు చేసిన తరువాత పారిపోకూడదని ఆయన సూచించారు. తాను బాహుబలి సినిమాను చూడలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమౌళితో సినిమా చేయాలని అనుకుంటే కుదరదని, సమయం వస్తే కుదురుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు.

  • Loading...

More Telugu News