: మా జట్టుకు కోచ్ గా ఉండాలనుకుంటున్నా: ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్


అవకాశం వస్తే తమ జాతీయ జట్టుకు కోచ్ గా పనిచేయాలనుకుంటున్నానని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ తెలిపాడు. పాంటిగ్ ముంబైలో మాట్లాడుతూ, ఏడాదిలో రెండు నెలల పాటు ఐపీఎల్ లో 'ముంబై ఇండియన్స్'కు కోచ్ గా వ్యవహరిస్తున్నానని అన్నాడు. మరికొంత కాలం బిగ్ బాష్ లీగ్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నానని, మిగతా సమయం అంతా కుటుంబంతో గడుపుతున్నానని పాంటింగ్ చెప్పాడు. స్టీవ్ స్మిత్, వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా వంటి ఆటగాళ్లతో పని చేయాలని ఉందని, ఆసీస్ జట్టుకు కోచ్ గా పనిచేయాలని ఉందని పాంటింగ్ ఆకాంక్షను వ్యక్తం చేశాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏమంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News