: ఐపీఎల్ ఆరంభ వేడుకలకు తొలగిన అడ్డంకి...ముంబైలో యథాతథం


ఐపీఎల్ ఆరంభ వేడుకలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మహారాష్ట్రలో కరవు నెలకొనడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణ పేరుతో నీటిని వేస్టు చేస్తున్నారంటూ, ఐపీఎల్ మ్యాచ్ లను వేరే రాష్ట్రాలకు తరలించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఐపీఎల్ ప్రారంభ వేడుకలను నిర్వహించకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ ను నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఐపీఎల్ ప్రారంభ వేడుకలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 9న ఐపీఎల్ మ్యాచ్ లు నిర్ణయించిన ప్రకారం ప్రారంభమవుతాయి.

  • Loading...

More Telugu News