: రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు షురూ...సంప్రదాయ దుస్తుల్లో గవర్నర్
హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రెండు రాష్ట్రాల ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఎప్పుడూ నీట్ గా కార్పొరేట్ ఉద్యోగిలా దర్శనమిచ్చే గవర్నర్ నరసింహన్, అందుకు భిన్నంగా సంప్రదాయ తెలుగు దుస్తులు ధరించి సందడి చేశారు. గవర్నర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. కాసేపట్లో ముఖ్యమంత్రులిద్దరూ రాజ్ భవన్ చేరుకుంటారని సమాచారం.