: హైదరాబాదు పాతబస్తీలో కాంట్రాక్టు మేరేజ్ కలకలం


హైదరాబాదులోని పాతబస్తీలో కాంట్రాక్టు మేరేజ్ కలకలం రేపింది. ఒమన్ కు చెందిన ఓ వ్యక్తి దగ్గర్నుంచి భారీగా డబ్బులు పుచ్చుకున్న ఖాజీ పాతబస్తీకి చెందిన నిరుపేద ముస్లిం యువతితో వివాహం జరిపించేందుకు ప్రయత్నంచాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సత్వరమే స్పందించడంతో ఓ యువతి నిండు జీవితం నిలబడింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివాహాన్ని ఆపి, పెళ్లి చేసుకుంటున్న ఒమన్ దేశస్థుడిని, ఖాజీని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతనికి ఇప్పటికే రెండు వివాహాలు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.

  • Loading...

More Telugu News