: సీఎం చిత్తశుద్ధిని సందేహించిన రేవంత్


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేడు బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. బయ్యారం గనుల్లో లభ్యమైన ఖనిజాన్ని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకున్న సీఎంకు చిత్తశుద్ధి ఉంటే.. ఓబుళాపురం ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలని రేవంత్ కోరారు. ఆయన నేడు హైదరాబాద్ లో టీడీఎల్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఖనిజ సంపదను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే వినియోగించాలని, ప్రైవేటు వ్యక్తులకు చెందిన కంపెనీలకు జాతీయ సంపద అయిన ఖనిజాలను కేటాయించరాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ పైనా రేవంత్ నిప్పులు చెరిగారు. బయ్యారం విషయంలో తెలంగాణ హక్కులు కాపాడుతున్నట్టు టీఆర్ఎస్ నాటకమాడుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News