: సుజనా చౌదరి అరెస్టుకు వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు


కేంద్ర మంత్రి సుజనా చౌదరి అరెస్టుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. 106 కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని చెల్లించడం లేదని మారిషస్ బ్యాంకు నాంపల్లి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఆయన అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. కాగా, గతంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కేంద్ర మంత్రిని కోర్టు ఆదేశించింది. అయితే ఆయన మాత్రం విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News