: బిపాసా బసుకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంకా చోప్రా


ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసుకు సహనటి ప్రియాంకా చోప్రా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ప్రియాంక్ ట్వీట్ చేసింది. కాగా, తనతో పాటుగా 'ఎలోన్' సినిమాలో నటించిన కరణ్ సింగ్ గ్రోవర్ ను బిపాసా వివాహం చేసుకోనుంది. ఈ నెల 28న మెహందీ కార్యక్రమం జరుగనుండగా, 29న రిసెప్షన్ నిర్వహించనున్నారు. రిసెప్షన్ కు బాలీవుడ్ నటులను, బంధువులను ఆహ్వానించి, ఏప్రిల్ 30న జరగనున్న వివాహానికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇరు వర్గాలకు చెందినవారు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ప్రియాంక ట్వీట్ తో బాలీవుడ్ లో వెలువడుతున్న కథనాలన్నీ వాస్తవమేనని రూఢి అవుతోంది.

  • Loading...

More Telugu News