: రోజా కేసులో అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు


రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సుప్రీం ఆదేశానుసారం తాను హైకోర్టును ఆశ్రయిస్తే, అక్కడ అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, వైకాపా ఎమ్మెల్యే రోజా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తూ, ఈలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అంతకుముందు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీలో జరిగే వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని, ఆ హక్కులు కోర్టులకు ఉండవని వాదించగా, దాన్ని కోర్టు తోసిపుచ్చింది. శాసన వ్యవస్థ వ్యవహారాల్లో కోర్టులు నేరుగా జోక్యం చేసుకోలేవన్నది నిజమే అయినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తేలితే జోక్యం చేసుకునే హక్కు ఉందన్న రోజా న్యాయవాది చేసిన వాదనతో ఏకీభవిస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News