: ఆ నినాదం నీటి స‌మ‌స్య తీర్చ‌దు: శివ‌సేన‌


'భార‌త్ మాతాకీ జై' అనే నినాదం మ‌హారాష్ట్ర‌లో నీటి స‌మ‌స్య తీర్చ‌బోద‌ని ఎన్డీఏ మిత్ర‌ప‌క్షం శివ‌సేన దెప్పిపొడిచింది. మహారాష్ట్రలో కరవు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ పరిస్థితిపై అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, లేదంటే శాంతి భ‌ద్ర‌త‌లకు విఘాతం క‌లుగుతుంద‌ని పేర్కొంది. 'భార‌త్ మాతా కీ జై' నినాదాన్ని త‌న‌ కుర్చీ కోల్పోయినా ప‌లుకుతూనే ఉంటాన‌ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. భార‌త్ మాతాకీ జై నినాదానికి బదులుగా ప్రభుత్వం నీటి క‌ష్టాలు తీర్చ‌డంలో విఫ‌ల‌మైతే ఫ‌డ్న‌విస్ సీఎం కుర్చీని వ‌దులుకుంటే బాగుంటుంద‌ని హిత‌వు ప‌లికింది. 'భారత మాతాకీ జై' నినాదంపై వివాదానికి ఇచ్చిన ప్రాధాన్యత కరవు నిర్మూలనకు ఇవ్వడం లేదని మండిప‌డింది.

  • Loading...

More Telugu News