: రేపు మా ఇంట మూడు పండగలు: రేణూ దేశాయ్
"రేపు మా ఇంట్లో నిజమైన పండగ" అంటూ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. తన ఇంట్లో మూడు విశేషాలున్నాయని సంతోషంగా పేర్కొంది. వీటిల్లో మొదటిది పవన్, రేణూ దేశాయ్ ల కుమారుడు అకీరా బర్త్ డే కాగా, రెండవది ఉగాది పర్వదినం. ఇక మూడవ విశేషం ఏంటంటే, రేపు పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం విడుదల. ఇవన్నీ తమ ఇంట సందడిని పెంచే పండగలేనని రేణూ చెబుతోంది. పూణెలోని తన ఇంట్లో అకీరా పుట్టిన రోజును, ఉగాదినీ జరుపుకోనున్నట్టు ఆమె వెల్లడించింది.